ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ సర్కార్ వీఆర్ఏలకు శుభవార్త తెలిపింది. వీఆర్ఏలకు డీఏ 300 నుంచి 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీఆర్ఏలకు డీఏ 300 గా ఉండేది. దానిని ప్రస్తుతం 500 లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచే పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా రాష్ట్రంలో సుమారు 19 వేల 359 మంది వీఆర్ఏ లు విధులు నిర్వర్తిస్తున్నారు. పెంచిన డీఏతో వీరందరికీ లబ్ది చేకూరనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్ఏలతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఐర్ కూడా ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
వీఆర్ఏలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్
81
previous post