జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ – కె.నారాయణ

K. Narayana

Advertisements

&NewLine;<p>జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ అని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె&period;నారాయణ ఎద్దేవా చేశారు&period; చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన ఐనంబాకం గ్రామంలో తన భూమికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకం&comma; సర్వే సిబ్బంది నాటిన రాళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు&period; ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ…జగనన్న భూరక్ష పథకం కింద పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించి&comma; ముఖ్యమంత్రి బొమ్మ వేసి ఇదే మీ పాసు పుస్తకం అని రైతులకు ఇస్తున్నారు&period; ఈ పాసు పుస్తకం నాలిక గీసుకోడానికి కూడా పనికి రాదు&period; అధికారులు ఇచ్చిన నియమాల మేరకే… బ్యాంకు రుణం తీసుకునే సందర్భంలో కానీ&comma; భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం&comma; పట్టాదారు పాసుపుస్తకం అధికారికి చూపించనవసరం లేదట&period; అంటే ఇది బోగస్ పత్రం&period; దేనికీ పనికి రాదు&period; నాలుక గీసుకునే దానికి కూడా పనికి రాదు&period; జగన్ బొమ్మ ముద్రించి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు&period; కాంగ్రెస్&comma; టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు ఎంతో విలువైనవి&period; వీటిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి&period; వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చు&period; జగన్ ఇచ్చిన పాసు పుస్తకంలో బొమ్మ కనిపిస్తుంది తప్పితే దేనికీ పనికి రాదు&period; ఈ పుస్తకంతో బ్యాంకులో రుణాలు ఇవ్వరు&period; హక్కు పత్రం రాదు&period; హక్కు రాదు&period; ఊరికే విగ్రహంలా పెట్టుకోవచ్చు&period; దీంతో పాటు రీ సర్వే చేశారు&period; ఈ సర్వేతో క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి&period; రైతులకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వడం వలన చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి&period; ఇలా చేయడం వలన రైతుల మధ్య వివాదాలు వస్తున్నాయి&period; అనేక తప్పుల తడకలతో భూరక్ష పథకం కింద పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నారు&period; ఇందుకోసం జగన్ సర్కారు వేల కోట్లు ఖర్చు చేసి బొమ్మలతో బండలు వేశారు&period; ఇలానే తెలంగాణలో మునుపటి ముఖ్యమంత్రి చేశారు&period; అందులో వినియోగదారుల హక్కులు కనబడలేదు&period; అనుభవదారుల హక్కు కనబడలేదు&period; ఈ కారణంగా అనుభవించే వారి భూమి భూస్వాముల పాలైంది&period; తెలంగాణలో కేసీఆర్ కు అదే దెబ్బ తీసింది&period; ఇలానే ఏపీలో జగన్ ను కూడా భూరక్ష పథకం దెబ్బ తీబోతోంది&period; ఈ రీ సర్వే వలన రైతుకు ఎలాంటి ఉపయోగం లేదు&period; బండలు కనిపిస్తాయి&period; పుస్తకం కనిపిస్తుది&period; ఈ పుస్తకం&comma; ఈ రాయి ఓ శిలా ఫథకంలా ఉంటాయి&period; స్మశాన వాటికలా ఉంటుంది తప్ప ఏం ఉపయోగం లేదు&period; ఈ బండలే రాబోయే కాలంలో జగన్ కు శిలాఫలకంలా మిగిలిపోతుంది&period; ఈ పథకమే రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించబోతోంది అంటూ నారాయణ హెచ్చరించారు&period; రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకం కింద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమం క్షేత్ర స్థాయిలో రైతుల మధ్య చిచ్చు పెడుతోంది&period; తరతరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమి ఇతరుల ఆధీనంలోకి వెళుతోంది&period; ఇది రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు&period; భూములు సర్వే చేయడానికి రోవర్ వినియోగించాలి&period; ఈ పరికరంతో సర్వే చేస్తే ఖచ్చితత్వం వస్తుంది&period; అయితే జగన్ సర్కారు రీ సర్వేకి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ &lpar;ఆర్వో ఐ&rpar; పరికరం వినియోగిస్తోంది&period; సర్వేకి ఈ పరికరం వినియోగించడం వలన పొలం విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు వస్తున్నాయి&period; పొలం గట్లలో సరిహద్దుల సమస్యలు వస్తున్నాయి&period; ఇవి చిలికి చిలికి గాలివానగా మారి దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది&period; ఇక ముఖ్యంగా రీ సర్వేకు రైతులు సహకరించడం లేదు&period; ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉంటున్నారు&period; క్షేత్రస్థాయిలో రీ సర్వేకు సహకరించాల్సిన గ్రామ రెవిన్యూ అధికారులు &lpar;వీఆర్వో&rpar; తమకు ఏమీ పట్టనట్లు ఉంటున్నారు&period; ఇక రీ సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డిప్యూటీ తహసీల్దారు&comma; మండల సర్వేయరుతో ఓ బృందం ఏర్పాటు చేసింది&period; సచివాలయ సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో సర్వే చేసే సమయంలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత ఈ మండల బృందంపై ఉంది&period; అయితే వీరు దిష్టి బొమ్మలా ఉంటున్నారు తప్ప… సమస్యల పరిష్కారానికి సహకరించడం లేదు&period; దీంతో సచివాలయ సర్వేయర్లు ఇబ్బందులు పడాల్సివస్తుంది&period; ముఖ్యంగా రీ సర్వే చేసిన గ్రామాల్లో ఉమ్మడి భూమికి 1-బి రావడం లేదు&period; 1-బి లేక పోవడం వలన రైతులు బ్యాంకుల్లో పాసుపుస్తకాలు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు&period; ఇది చాలా ప్రధాన సమస్య&period; ఇది ప్రభుత్వానికి తెలిసినా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు&period; రైతులకు కూడా భూ సర్వేపై అవగాహన లేక పోవడం ప్రధాన సమస్య&period; ఇక సచివాలయ సర్వేయర్లకు సర్వే చేయడానికి తగిన సమయం ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచడం వలన కొలతల్లో ఖచ్చితత్వం లోపిస్తోందనే విమర్శ బలంగా ఉంది&period; ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..