పల్నాడు జిల్లా, చిలకలూరిపేట సంక్షేమ సారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల అభ్యున్నత కోసం అడుగడుగునా పరితపిస్తూ నవరత్న పథకాలతోటే పేదల తలరాత మార్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను, చిలకలూరిపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలోని వైస్సార్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం రాజేష్ నాయుడు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో కోలాహాలంగా ఏర్పాట్లు నిర్వహించామని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. అంతేకాకుండా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఎన్నార్టీ రోడ్డు లో గల పాత పశువుల సంత ప్రక్కన గోల్కొండ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని మేము ఇచ్చే ప్రేమ విందును స్వీకరించాలని కోరారు.
చిలకలూరిపేటలో జగన్ పుట్టినరోజు వేడుకలు..
127
previous post