ఏపీ సీఎం జగన్కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ఇలా ప్రతి రంగానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారి మళ్లించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగున్నరేళ్లలో రూ. 71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
జగన్కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదు – యనమల రామకృష్ణుడు
53
previous post