74
వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రైతులను పరామర్శించడానికి వచ్చావని. రైతులను పరామర్శించేందుకు వచ్చిన నువ్వు కులమతాల పేరుతో ప్రశాంతంగా ఉన్న మా డెల్టా ప్రాంతానిక తగాదాలు పెడతావా అని మంత్రి నాగార్జున మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ధాటికి తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల కలెక్టర్లకు సూచనలు ఇచ్చి ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించారని తెలిపారు. వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతులకు అనేక పథకాలు అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. హుదుద్ తుఫాన్ కి చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి ఏం సహాయకు చర్యలు తీసుకున్నారు ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు.