జగిత్యాల జిల్లాలోని ఓ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది…

Advertisements

<p>జగిత్యాల జిల్లాలోని ఓ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది&period; విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన హాస్టల్ సిబ్బందే వారిపై ప్రతాపం చూపిస్తున్నారు&period; హాస్టల్‌లో కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి&comma; చదువుకోవడానికి వచ్చిన చిన్నారులను చీపురుతో చితకబాదుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు&period; తాళ్ల ధర్మారం నుండి డిప్యూటేషన్‌పై జగిత్యాలకు వచ్చిన ఈ ప్రబుద్ధుడు&period;&period; గత నాలుగు నెలలుగా రోజూ మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది&period; తాగి వచ్చి విధులకు హాజరవడమే కాకుండా&period;&period;ఏ కారణం లేకుండా తమను చీపురుతో కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; పిల్లలను చదువుకోవడానికి హాస్టల్‌కు పంపిస్తే&comma; అక్కడ వారిని చిత్రహింసలకు గురిచేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు&period; నాలుగు నెలలుగా ఇలాంటి దారుణం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీస్తున్నారు&period; వెంటనే సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే హాస్టల్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు&period; అయితే ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు సదరు వ్యక్తిని మందలించినప్పటికీ&comma; అతని తీరులో మార్పు రాలేదు&period; ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే శ్రీనివాస్ ఇంత కాలం తన ఆగడాలను సాగించగలిగాడని హాస్టల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఈ ఘటనపై ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు అందింది&period; దీనిపై స్పందించిన అధికారులు&comma; శ్రీనివాస్‌పై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు&period; అవసరమైతే అతడిని విధుల నుంచి తొలగించి&comma; క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు&period; పసిపిల్లలపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.