లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (సీపీఎం), కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు…

Advertisements

<p>కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత&comma; లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ &lpar;సీపీఎం&rpar;&comma; కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు&period; ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని&comma; కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేవలం వామపక్షాలతోనే కాకుండా&period;&period; &OpenCurlyQuote;ఎల్డీఎఫ్-బీజేపీల’ ఉమ్మడి కూటమితో పోరాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు&period; పతనంతిట్ట జిల్లా అడూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు&period; గుడిలోని బంగారాన్ని వామపక్ష నేతలు కాజేసి&comma; ఆ స్థానంలో ఇత్తడి ఉంచారన్న ఆరోపణలపై ప్రధాని మౌనం వహించడం&period;&period; ఎల్డీఎఫ్&comma; బీజేపీల కుమ్మక్కును స్పష్టం చేస్తోందన్నారు&period; ఓట్లు వస్తాయనుకుంటేనే మోడీకి గుడులు&comma; మతం గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు&period; కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయని&comma; తనపై 36 కేసులు పెట్టి 55 గంటలపాటు విచారించారని రాహుల్ గుర్తుచేశారు&period; కానీ&comma; ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే వారి &OpenCurlyQuote;అపవిత్ర పొత్తు’కు నిదర్శనమన్నారు&period; అవినీతి మరకల వల్లే సీఎం విజయన్&period;&period; మోడీ గుప్పిట్లో ఉన్నారని ఆరోపించారు&period; కేరళలోని వామపక్ష ప్రభుత్వం తన సైద్ధాంతిక మూలాలను గాలికొదిలేసిందని విమర్శించారు&period; కేరళలో యూడీఎఫ్‌ను దెబ్బతీయాలని బీజేపీ తెరవెనుక రాజకీయం నడుపుతోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.