146
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాబును కలిసిన జనసేన నాయకులు తమ పార్టీ కండువా కప్పారు. గతంలో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇప్పటివరకు టీడీపీ కండువా లేకుండా ఇతర పార్టీ కండువాలు కప్పుకున్న దాఖలాలు లేవు. కానీ తొలిసారి జనసేన కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కుప్పంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంలో తిరుపతికి చెందిన బత్తిన మధుబాబు., చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జై జనసేన జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.