జనగామ జిల్లాలో దారుణం | Janagama Murder
మనవడి చేతిలో నానమ్మ మృతి చెందిన ఘటన జాఫర్ ఘడ్(Jafargarh) మండలం ఉప్పుగల్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మామిడ్ల ఎల్లమ్మ 65 అనే వృద్ధురాలు కొడుకు సమ్మయ్య ఇంట్లో నివాసం ఉంటోంది. గత కొద్దిరోజుల క్రితం కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు ఈ క్రమంలో కోడలు రజిత మనవడితో కలిసి ఉంటుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అత్తా కోడలు తరచూ గొడవ పడుతుండడంతో వృద్ధురాలి వల్లే తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నెపంతో కొడుకు సమ్మయ్య కుమారుడు మైనర్ బాలుడు ఎల్లమ్మ నిద్రిస్తున్న క్రమంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎల్లమ్మ మృత్యువాత పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోగా పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని మార్చరికి తరలించారు. దీంతో ఎల్లమ్మ హత్య ఉదాంతం స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నానమ్మ ని కడతేర్చిన మైనర్ మనవడు