ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూప్రకంపనలు..

Advertisements

<p>జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది&period; ఉత్తర జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7&period;4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి&period; సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు&period; దీంతో అధికారులు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు&period; తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లో&comma; ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు&period; తీర ప్రాంతంలో మూడు మీటర్ల మేర అలలు ఎగిసిపడవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>జపాన్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాల్లో ఒకటి&period; సాధారణంగా ప్రతి సంవత్సరం దాదాపు 1&comma;500 వరకు భూకంపాలు సంభవిస్తాయి&period; తాజాగా సంభవించిన భూకంపం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4&period;54 గంటలకు ఉత్తర జపాన్‌లోని సన్రికు ప్రాంతంలో సంభవించిందని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.