కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్రతో యుద్దానికైనా సిద్ధమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు, నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ(Telangana)ను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కు తాకట్టు పెట్టావాడని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులకు ఆయన చాలెంజ్ చేశారు. 2004కు ముందు సిరిసిల్ల, సిద్ధిపేటలో జరిగిన అభివృధిపై హరీష్, కేటీఆర్ లు చర్చ కు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) తో దేశంలో తెలంగాణ(Telangana) పరువు పోయిందన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యంగాన్ని మార్చి రిజర్వేషన్ లను రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి