జగిత్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళ వద్ద నగలు చోరీ..

Jewelery stolen from woman in Jagityala RTC bus stand..

Advertisements

&NewLine;<p>జగిత్యాల కొత్త బస్టాండ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఓ మహిళ వద్ద బ్యాగ్ లో ఉన్న 15 తులాల బంగారు నగలు అపహరణకు గురైన ఘటన చోటుచేసుకుంది&period; మెట్ పల్లి పట్టణంలో వెల్లుల్ల రోడ్ కి చెందిన కి చెందిన సురిగి మంగరాణి తన కూతురుతో బీర్పూర్ మం&period; లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో జగిత్యాల కొత్త బస్టాండ్ లో మెట్ పల్లి బస్సు కోసం నిరీక్షిస్తుంది&period; ఈ క్రమంలో నగలు అపహరణకు గురైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించింది&period; విషయం తెలుసుకున్న జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్&comma; ఎస్ ఐ నరేష్ లు జగిత్యాల కొత్త బస్టాండ్ కు చేరుకుని బస్ స్టాండ్ లోని కంట్రోల్ రూమ్ లోని సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలించారు&period; అనంతరం బాధితురాలి నుండి ఫిర్యాదు స్వీకరించి జగిత్యాల టౌన్ సి ఐ వేణుగోపాల్ దర్యాప్తు చేస్తున్నారు&period; ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..