పవన్ కు జోగయ్య సంచలన లేఖ..!

Jogaiah's sensational letter to Pawan

Advertisements

&NewLine;<p>యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వస్తామని కలలుగన్న జనసైనికులకు సమాధానం చెప్పాలని పవన్ ను ప్రశ్నించారు హరిరామ జోగయ్య&period; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు&period; చంద్రబాబు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే మాటకు రెండో మాట లేదని అనుభవంతుడైన నాయకత్వం కావాలి అనే మాటను పలుసార్లు పవన్ కళ్యాణ్ ప్రకటించాడని జోగయ్య అన్నారు&period; అంటే పూర్తికాలం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండేందుకు మీ ఆమోదం ఉందా అని పవన్ ను ప్రశ్నించారు&period; రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్‌ నిజంగా సమర్థిస్తున్నాడా&quest; ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య&period; ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే సామాజిక వర్గాలు రాజ్యమేలుతున్నాయని జోగయ్య విమర్శించారు&period; 80 శాతం ఉన్న బడుగు&comma; బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి స్పష్టం చేయాలని జనసేనానిని ప్రశ్నించారు హరిరామ జోగయ్య&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..