ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు

Advertisements

<p>అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి&period; ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే&period;&period; కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి&period; పంటలు పండించిన పాపానికి&period;&period;అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు&period; ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా&period;&period; క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదు&period; సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఆదేశాలు జారీ చేసినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది&period; ఎక్కడా కూడా రైతుకు సంతృప్తికర పరిస్థితులు లేవు&period; జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్‌ అందిస్తున్న స్పెషల్‌ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>నల్గొండ జిల్లా వరప్రదాయిని అయిన నాగార్జున సాగర్‌ ప్రాంతానికి వెళ్తే అక్కడ సాగునీరు సమృద్ధిగా ఉంది&period;&period; పంటలు అద్భుతంగా పండాయి&period; కానీ&comma; ఆ అన్నదాతల కళ్లల్లో మాత్రం ఆనందం లేదు&period; పంట చేతికొచ్చి రెండు నెలలవుతున్నా&period;&period;కొనుగోళ్లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; ఒకవేళ అరకొరగా కొన్నా&&num;8230&semi; తాలు పేరిట అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు&period; కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవు&period; ఎప్పుడు వర్షం పడి ధాన్యం నీట కొట్టుకుపోతుందో తెలియక అన్నదాత ఆవేదన పడుతున్నారు&period; ప్రాణాలన్నీ అరచేతిలో పెట్టుకుని&&num;8230&semi; పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఇటు చౌటుప్పల్‌ ప్రాంతంలోనూ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి&period; వడ్ల కొనుగోలుకు ఎలాగూ అధికారులు ఏర్పాట్లు చేయరు&period; కనీసం వాటి కాపలాకు తమకు రైతులకు మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవని వాపోతున్నారు&period; ప్రభుత్వం క్వింటాకు అదనంగా 300 రూపాయలిస్తే&&num;8230&semi; ఖర్చుల రూపంలోనే ఐదు వందలు ఎగిరిపోతున్నాయని&period;&period; అన్నదాతలు మండిపడుతున్నారు&period; కనీసం వడ్లను ఎత్తిపెట్టడానికి సరిపడా గన్నీ బ్యాగులు కూడా లేవని చౌటుప్పల్‌ ప్రాంత రైతులు నిప్పులు చెరుగుతున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>మరోవైపు మిర్యాలగూడెం ప్రాంత రైతులకు మరో రకమైన సమస్య ఎదురవుతోంది&period; మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ధాన్యం కొనుగోళ్లు కొంత వేగంగా జరుగుతున్నప్పటికీ&&num;8230&semi; తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు రావడం లేదు&period; దీంతో విసిగిపోయిన రైతన్నలు రోడ్లెక్కి నిరసనలు తెలిపారు&period; వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి&period;&period;కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు&period; ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు&period; అయితే పరిస్థితిలో ఏమంత మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు&period; తాలు కింద క్వింటాకు 2 కిలోలకు పైగానే కోత పెడుతున్నారని&period;&period; ప్రభుత్వం మరింత చొరవ చూపితే తప్ప వ్యవస్థ బాగుపడదని రైతులు అంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>అటు తిరుమలగిరి ప్రాంతంలో ఒకవైపు కొనుగోళ్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతుంటే&period;&period; రైతుల గోస మాత్రం వర్ణనాతీతంగా మారింది&period; అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు ఇష్టం వచ్చిన వారికి ముందు కాంటా వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ఒకే సీరియల్‌ నంబర్ మీద 10 మంది దగ్గర ధాన్యం కొంటున్నారని చెబుతున్నారు&period; కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవడంతో&period;&period; రైతులు ధాన్యం కుప్పల ముందే రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు&period; వర్షం వస్తే సర్వస్వం కోల్పోతామనే భయంతో&period;&period; వేరే దారి లేక&comma; అప్పులు చేసి మరీ సొంత డబ్బులతో మార్కెట్‌లో గన్నీ సంచులు కొనుక్కుంటున్నారు&period; అటు కాంట్రాక్టర్ల పట్టింపులేనితనం&comma; అధికారుల సమన్వయ లోపంతో లారీల కొరత అలాగే వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>సూర్యాపేట ప్రాంతంలోనూ ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి&period; కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై రైతాంగం తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తంచేస్తోంది&period; వడ్లు తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ఇంకా వేగంగా జరగడం లేదని మండిపడుతున్నారు&period; ఓ వైపు వర్షాలు వస్తాయన్న సూచనలుంటే&period;&period; ఇంకోవైపు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు&period; ముందు జాగ్రత్తగా ధాన్యాన్ని మరో ఐకేపీ సెంటర్‌కు తీసుకెళ్లాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు&period; లారీలు&comma; గన్నీ బ్యాగుల కొరత చాలా తీవ్రంగా ఉందని&period;&period; వాటిని ముందుగా సమకూర్చాలని కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>మొత్తం మీద పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది నల్గొండ జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి&period; ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కాగితపు సమీక్షలు పక్కన పెట్టి&period;&period; యుద్ధప్రాతిపదికన లారీలను సమకూర్చి&comma; కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని నల్గొండ జిల్లా అన్నదాతలు చేతులు జోడించి వేడుకుంటున్నారు&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;<p>నీళ్లు పుష్కలంగా ఉండి పంటలైతే బ్రహ్మాండంగా పండాయి&period;&period; కానీ కొనుగోళ్లు జరగక ఆ పంటంతా ఇప్పుడు కల్లాలు&comma; ఐకేపీ కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి&period; ఏది ఏమైనా&period;&period; ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న&period;&period;ఇవాళ రోడ్డున పడి కన్నీరు కార్చుతున్నాడు&period; సీఎం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనడానికి నల్గొండ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి&period; ఇప్పటికైనా అధికారులు సమీక్షల నుంచి బయటకు వచ్చి&period;&period; యుద్ధప్రాతిపదికన గన్నీ సంచులు&comma; లారీలను సమకూర్చాలి&period; అకాల వర్షాల ముప్పు నుండి ధాన్యాన్ని కాపాడి&comma; వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..