90
జూబ్లీహిల్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా టారో పబ్‌లు, గ్రీస్ మంకీ, లఫ్ట్ పబ్, మకావ్ పబ్, జీనా పబ్ వేడుకలను నిర్వహించాయి. నిర్ణీత సమయం ముగిసినా పబ్‌లు కొనసాగాయి. పబ్‌ల నుంచి భారీ శబ్దం వస్తుందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఆరు పబ్‌లపై ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టం కింద కేసు నమోదు చేశారు. శబ్ద కాలుష్యానికి పాల్పడిన పబ్‌లపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also..