113
పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు, చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగాయి. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేవాలయాలకు చేరుకోగా, వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దేవస్థాన ప్రాంగణంలో స్వామివారికి కార్తీకదీప పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో కార్తీక మాసోత్సవ వేడుకలు విజయవంతంగా ముగుస్తున్నాయని దేవదాయ శాఖ అధికారి నటరాజన్ షణ్ముగం అన్నారు.