75
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నేడు చింతమడకకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత చింతమడక చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుపై ఆదేశాలు ఇచ్చారు. ప్రతిసారి కేసీఆర్ స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.