69
ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆ పార్టీ అగ్రనేత జైరామ్ రమేష్ ఆరోపించారు. ఒక్క హైదరాబాద్ తప్ప ఎక్కడా అభివృద్ధి అనేది లేనే లేదన్నారు. ఖమ్మం నగరంలో ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పార్టీ స్థితిగతులను సమీక్షించారు. బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. యువకులను ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఇక TSPSC అవినీతికి కేరాఫ్ గా మారిందని జైరాం రమేష్ విమర్శించారు. పేపర్లు అమ్ముకోవడం దారుణమన్నారు. మరికొన్ని రోజుల్లో కేసీఆర్ దుర్మార్గ పాలనకు పుల్ స్టాప్ పడుతుందన్నారు.