రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్(KCR)ను మళ్లీ చూస్తారని అన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్కే మేలు జరుగుతుందని కేసిఆర్ అన్నారు.
ఇది చదవండి: నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!
ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారని.. బస్సు యాత్ర రూట్ మ్యాప్ త్వరలో ఖరారవుతుందన్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని.. రానున్న రోజులు మనవేనన్నారు. పార్లమెంట్లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉందని రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సూచించారు. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్కు నష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి