75
టీడీపీ నాయకత్వంపై అలకబూని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచే ఎంపీగా పోటీ చేయనున్నారు. వైసీపీ నాయకత్వం విడుదల చేసిన మూడో జాబితాలో కేశినేని నానిని విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా నియమించారు. దీనిపై కేశినేని నాని స్పందించారు. వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ కేశినేని నాని పేర్కొన్నారు. మీ నాయకత్వంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను” అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Read Also..