Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh పల్లెకు బయలుదేరిన కార్లు….

పల్లెకు బయలుదేరిన కార్లు….

by Rama
Tollplaza

బతుకుదెరువు కోసం ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జనం సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజాలు కార్లు ఇతర వాహనాలతో రద్దీగా మారాయి. టోల్‌ప్లాజాల వద్ద వాహనాల తాకిడి పెరిగింది. పండుగకు పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని జీఎంఆర్ సిబ్బంది విజయవాడ వైపు వెళ్లే.. వాహన లైన్ల సంఖ్య పెంచినా ఏ మాత్రం రద్దీ తగ్గడం లేదు. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతోంది.

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: