తెలంగాణ(Telangana) ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Papping Case) కీలక మలుపులు తీరుగుతోంది. హైదరాబాద్(Hyderabad) టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు(Radhakishan Rao) రిమాండ్ రిపోర్టులో ముఖ్యమైన అంశాలు వెలుగుచూశాయి. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టు(Remand Report)లో కీలక విషయాలను పోలీసు(police)లు వెల్లడించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీగా ఉన్న ఆయన్ని కేసులో A4గా చేర్చారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు రాధాకిషన్‌రావు వెల్లడించారు.
ఇది చదవండి: కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నేత రఘునందన్‌రావు, ఆయన బంధువుల నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించారు. ముడుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన 3 కోట్ల 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు రాధాకిషన్‌రావు చెప్పారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి