పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకు అని హేళన చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 55 కోట్ల బ్యాంకు ఖాతాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం పేదలు దాదాపు 2 లక్షల కోట్లు పొదుపు చేసుకున్నారని తెలిపారు.. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవన్నారు. కాంగ్రెస్ హయాంలో ద్రవ్యోల్బణం 12 శాతానికి పైగా ఉండేదన్నారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా వ్యవహరిస్తున్న ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని తెలిపారు. టూరిజంలో దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. కేవలం కాశీ ఆలయాన్ని 11 కోట్ల మంది దర్శించుకున్నారని…. జాతీయ రహదారుల నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు.
పేదలకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదా…
111
previous post