కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ..!

Kishan Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణ ప్రజల ఆకాంక్షలు&comma; అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను&period; అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని కేంద్ర మంత్రి&comma; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు&period; బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారంటూ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు&period; అసలు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయాలని మిమ్మల్ని అడిగిందెవరంటూ కేసీఆర్ ను ఆయన నిలదీశారు&period; ఈమేరకు సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు&period; వరుసగా ఇది తన నాలుగవ లేఖ అని&comma; దీనికి కూడా స్పందించరా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు&period;<br>జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని మండలాన్ని తన జిల్లాలో బలవంతంగా కలిపేసుకున్నాడని కిషన్ రెడ్డి చెప్పారు&period; దీనికి కారణమేంటని విచారిస్తే భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ మండలంలో స్థిరపడిన తన బావమరిదిని ఎమ్మెల్యేగా నిలబెట్టేందుకు అడ్డంకులు ఉండకూడదనే ఈ పని చేసినట్లు తేలిందన్నారు&period; పలువురు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో భూములు కొని&comma; వాటికి విలువ వచ్చేలా జిల్లాలను ఏర్పాటు చేయించుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..