ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మిత్రపార్టీ జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ‘రా.. కదలి రా..’ పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ మాయలో పడ్డారని.. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు అంటూ ధ్వజమెత్తారు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారన్నారు. జగన్ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. 2029 నాటికి ఏపీ నంబర్ వన్ కావాలని ప్రణాళికలు రచించామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. తన అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.
అప్పుడేమో ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు..
67
previous post