గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసుకోండి..!

temple is buried

Advertisements

&NewLine;<p>గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు&period; ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు&period; అయితే ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు&period; ఏదో ప్రాచీనకాలం నుంచి అలా నడుస్తూ వస్తోంది కాబట్టి ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు&period; ఇంకొందిమంది మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడిస్తారు&period; అంతే తప్ప దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు&period; అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం వుందని జ్యోతిష్యులు చెబుతున్నారు&period; గుడిలో మూలవిరాట్టు వుండే గర్భాలయం ప్రశస్తమైంది&period; గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా&comma; వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టిస్తారు&period; పూజలు&comma; నిత్య మంత్రార్చన చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది&period; దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది&period; ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి&period; ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపుగోడ&period; అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు&period; భక్తులు అక్కడ ఆగినప్పుడు తపశ్సక్తిని పొందడానికి వీలుగా వుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలో అఖండ దీపం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..