మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

Advertisements

<p>నల్గొండలో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిగా మారాయి&period; ఆయన మాటల్లో స్పష్టతతో పాటు ప్రతిపక్షంపై పదునైన విమర్శలు కనిపించాయి&period; ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రస్తుత స్థితిని ఎండగట్టేలా ఉన్నాయి&period; బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విచ్ఛిన్నమైందని&comma; ఇకపై ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు&period; 2039 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూనే&comma; కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలను ఆయన బయటపెట్టారు&period; పదవులు&comma; పంపకాల కోసం తండ్రి-కొడుకులు&comma; మామ- అల్లుడు మధ్య పోరు నడుస్తోందని&comma; ముందు కేసీఆర్ తన &OpenCurlyQuote;ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అని ఆయన హితవు పలికారు&period;<&sol;p>&NewLine;<p>గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మంత్రి ఎండగట్టారని&comma; దళితుడే తొలి సీఎం&comma; ఇంటికో ఉద్యోగం&comma; దళితులకు మూడెకరాల భూమి వంటి మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు&period; కనీసం అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం&comma; ఇప్పుడు పునరంకితం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు&period; కేసీఆర్ అబద్ధాలు ఆడటంలో దిట్ట అని&comma; ఆయన ఫ్రస్టేషన్‌లో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు&period; జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్ వైపు చూడటం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు&period; అలాగే మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని&comma; రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు&period; మెుత్తానికి వెంకటరెడ్డి ప్రసంగం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎంత వేడెక్కనున్నాయో సూచిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.