సింగపూర్‌లో ఏపీ మంత్రుల పర్యటన..

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి&comma; విదేశీ పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఏపీ మంత్రుల బృందం సింగపూర్‌లో పర్యటిస్తోంది&period; ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రుల బృందం కీలక సమావేశాన్ని నిర్వహించింది&period; సింగపూర్ విదేశీ వ్యవహారాలు&comma; వాణిజ్య&comma; పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో ఏపీ మంత్రుల బృందం భేటీ అయ్యింది&period; భారత హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ&comma; బీసీ జనార్దన్ రెడ్డి&comma; వంగలపూడి అనిత&comma; కింజరాపు అచ్చెన్నాయుడు&comma; సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు&period; భారత్ &&num;8211&semi; సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలను&comma; ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు&period; అదేవిధంగా ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విస్తరణకు ఉన్న అవకాశాలను మంత్రులు వివరించారు&period; మౌలిక వసతుల కల్పన&comma; లాజిస్టిక్స్&comma; పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయి&period; కాగా&comma; మంత్రుల బృందం ఏప్రిల్ 27 వరకు మొత్తం 7 రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనుంది&period; ఈ పర్యటనలో భాగంగా మరిన్ని పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉంది&period; అమరావతి నిర్మాణం&comma; రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.