దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..

Advertisements

<p>కాళీ క్రాఫ్ట్స్&comma; నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్&period; చరణ్ పీసర్ల హీరోగా&comma;<br &sol;>&NewLine;యానీ డయానా&comma; దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా రోహిత్ సత్యన్&comma; సుజాత దీక్షిత్&comma; చంద్ర గౌతమ్&comma; సత్య&comma; సురభి లలిత&comma; గీతన్ సాయి తేజ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ చిత్రానికి మురళీకృష్ణ మన్యం ఎడిటర్ గా పని చేయగా రాంబాబు గోసాల లిరిక్స్ అందించారు&period; బ్రిజేష్ తంగి&comma; చరణ్ పీసర్ల చిత్ర డైలాగులు లిఖించారు&period; దండోరా చిత్ర దర్శకుడు మురళికాంత్ దేవసోత్&comma; కిష్కింధపురి చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా &&num;8220&semi;సూర్య బి పాజిటివ్&&num;8221&semi; అనే ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా నటుడు బలగం సత్యా మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నన్ను సంప్రదించి నాకోసం నా వరకు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది&period; నాపై నమ్మకంతో నాతో సరికొత్త క్యారెక్టర్ చేయించిన ఆ వ్యక్తి ఈ సినిమా హీరో చరణ్&period; నాతో చాలా బాగా నటించేలా చేశారు&period; చాలా మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది&comma; అందరూ ఈ సినిమాను ఆశీర్వదించలవలసిందిగా కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రోహిత్ సత్యన్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కౌశిక్ పెగల్లపాటి గారికి&comma; మురళీకాంత్ దేవసోత్ గారికి నా ధన్యవాదాలు&period; నేను 2017 నుండి చిత్ర పరిశ్రమలో పాత్రలు చేస్తూ ఉన్నాను&period; కాని ఈరోజు ఈ సినిమా వల్ల తొలిసారి స్టేజ్ పై మాట్లాడుతున్నాను&period; నాకు వచ్చిన ప్రతి కష్టాన్ని దాటుకుని ఇక్కడ వరకు వచ్చాను&period; నా వయసుకు మించిన క్యారెక్టర్ నాతో దర్శకులు చేయించారు&comma; అది నాకు ఛాలెంజ్ గా నిలిచింది&period; ఆయన కొన్ని కారణాల వల్ల అమెరికాలో ఉన్నారు&period; ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది&period; ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి&period; తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఎప్పుడూ ప్రోత్సప్రోత్సహిస్తూనే ఉంటారు&comma; మా సినిమాను ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి సుజాత మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;సూర్య బి పాజిటివ్ చిత్ర తొలి వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఇద్దరు దర్శకులకు ధన్యవాదాలు&period; సాధారణంగా నేను చాలా గట్టిగా మాట్లాడే మనిషిని&comma; కానీ ఈ చిత్రంలో నా పాత్ర చాలా సైలెంట్&period; నేను ఇప్పటివరకు నటించిన పాత్రలలో ఎక్కువ డైలాగులు ఉండేవి కాని ఈ సినిమాలో నా కళ్ళతో నటించేలా చేశారు&period; నా పాత్రకు&comma; నాకు పూర్తిగా వ్యతిరేకం&period; సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు&period; సినిమా టీజర్ చాలా బావుంది&period; సినిమాలో చరణ్ చాలా బాగా నటించారు&period; మన చుట్టు పక్కల ప్రాంతాలలో మనం చూసే ఒక సాధారణ కథను సినిమాగా మీ ముందుకు తీసుకుని రాబోతున్నాము&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి దివ్య విశ్వకర్మ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు&period; నేను ఈ రోజు ఒక తెలుగు సినిమాలో నటించి ఈ స్టేజిపై నిలబడడం అనేది ప్రత్యేకంగా అనిపిస్తుంది&period; నా భాష కానప్పటికీ నన్ను ఆదరించి&comma; నాకు అవకాశం ఇచ్చినందుకుగాను ఆనందంతో పొంగిపోతున్నాను&period; నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను&period; నాతో నటించిన నటీనటులు&comma; టెక్నికల్ టీం నాకు చాలా సాయం చేశారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి యానీ డయానా మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు&comma; మీడియా వారికి థాంక్స్&period; మా దర్శకునికి&comma; నటినటులకు&comma; సాంకేతిక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను&period; మా చిత్ర టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను&period; ఇది నా తొలి సినిమా&period; అందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు చరణ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; ఒక కొత్త సినిమా చేసేటప్పుడు ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో తెలిసి&comma; ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ కష్టాన్ని మర్చిపోకుండా మరొక కొత్త సినిమా వస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించే దశగా మా సినిమాకు సపోర్టుగా వచ్చిన దర్శకులు కౌశిక్ పెగల్లపాటి గారికి&comma; మురళీకాంత్ దేవసోత్ గారికి రుణపడి ఉంటాను&period; మా దర్శకులు అమెరికాలో ఉంటారు&period; ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు&period; మా నిర్మాత ఆయన ఎన్ని సంవత్సరాల కష్టాన్ని మాపై నమ్మకంతో ఈ సినిమాపై పెట్టారు&period; నా పేరు చరణ్&comma; నేను ఒక నటుడుని&period; నన్ను నేను ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నాను&period; మా సినిమా టీజర్ మీకు నచ్చుతుంది&period; నటుడిగా గుర్తింపు పొందాలంటే అర్హత ఉండాలని నేను భావిస్తున్నాను&period; గతంలో ఎంతో పెద్దవారికి అటువంటి అర్హతను ప్రేక్షకులు ఇచ్చారు&period; నేను ఆ అర్హతను అడుగుతున్నాను&period; నేను ఇప్పటికి మూడు సినిమాలలో చేశా&comma; కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు&period; ఇది నాలుగవ సినిమా&comma; ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నాను&period; నేను ఎప్పటికీ ఆగిపోను&comma; ముందుకు వెళ్ళిపోతాను&period; నన్ను అవమానించిన పర్లేదు&comma; భవిష్యత్తులో సత్కారంగా మారుతుందని నమ్ముతున్నాను&period; నాకు నటుడిగా అర్హత ఇవ్వమని మరోసారి కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ సినిమాకు నేను పాటల రాయడానికి గల కారణం సంగీత దర్శకులు గ్యాని&period; ఈ సినిమాలో పాటలకు మంచి ట్యూన్స్ అందించారు&period; ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డారు&comma; మంచి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమంలో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను&period; దర్శకులు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ నాకు ఇన్పుట్స్ ఇవ్వడంతో పాటలు చాలా బాగా వచ్చాయి&period; పాటలు త్వరలో రాబోతున్నాయి&comma; సినిమాను కూడా మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దండోరా చిత్ర దర్శకులు మురళికాంత్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికి నమస్కారం&period; ముందుగా నన్ను ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు వచ్చినప్పుడు వీరు చేసిన కష్టం గురించి తెలుసుకున్నాను&period; ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక సినిమా చేయడం చాలా కష్టమైన విషయం&period; నేను నా సినిమా చేసేప్పుడు అవి అన్నీ చూసాను&period; ప్రేక్షకులు అంతా సినిమాను ఓటీటీలో మంచి ప్రేక్షకుల అభిమానం సంపాదించింది&period; ఈ చిత్రంలో నటించిన రోహిత్ సత్యన్ గారిని చూసి ఆశ్చర్యపోయాను&period; చిత్ర బృందం చిన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా గుర్తుండిపోయేలా చేశారు&period; సినిమాలో అవకాశం వచ్చిన మొదటిసారి ఆ అవకాశం ఒక్కసారే వస్తుంది అని అర్థమైన రోజున సినిమా బాగా చేస్తారు&period; సుబ్బ మాధవరపు గారు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి సినిమా చేశారు&period; అలా చేయడం నావల్ల కాలేదు&comma; దానికి నేను ఆయనను అభినందిస్తున్నాను&period; డీఓపీ విజువల్స్ బావున్నాయి&period; ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కిష్కిందపురి చిత్ర దర్శకులు కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికి నమస్కారం&period; ఈ సినిమా టీజర్ చూసినప్పుడు నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది&period; కట్ చేసిన విధానం అద్భుతంగా ఉంది&period; నేను ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం మురళి గారు నా సీనియర్&comma; అలాగే చరణ్ నా జూనియర్&period; మేమంతా ఒకటే కాలేజీ నుండి వచ్చాము&period; ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది&period; హీరో అవ్వడం అంత సులువు కాదు&comma; ప్రేక్షకులు వారిని హీరోల చూసుకోవాలి&period; వారికి ఉన్న కష్టాలు మర్చిపోయి సినిమాలో హీరో గెలిచినప్పుడు తామే గెలిచినట్లు ఫీల్ అవ్వాలి&period; తెరపై చరణ్ గెలుపును చూసి ప్రేక్షకులు గెలిచినట్లు ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను&period; షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న రోజుల్లో నా సీనియర్ మురళి అన్న&comma; రమణ అన్న&comma; విజయ్ అన్న చాలా నేర్పించారు&period; అమెరికా నుండి వచ్చి ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసుకుని వెళ్లారు అంటే నేను నమ్మలేకపోతున్నాను&period; రోహిత్ సత్య గారి పాత్ర చాలా బాగా అనిపించింది&period; సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్&period; సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.