పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Advertisements

<p>పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది&period; అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది&period; ఈ విమాన వాహకనౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని&comma; దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది&period; దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది&period;యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌ తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది&period; ఇందులోభాగంగానే నెల రోజుల కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను ఇరాన్‌కు పాకిస్థాన్ అందించింది&period; ఇలాంటి సమయంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం&period; దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనే దానిపై ఆందోళన నెలకొంది&period; అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు&period; తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని&comma; దాంతో అది పనిచేయడం లేదని&comma; గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల పేర్కొంది&period; ఆ ప్రకటనను అప్పట్లో అమెరికా తోసిపుచ్చింది&period;తాజా దాడిపై ఎలాంటి ప్రకటన చేయలేదు&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమవుతున్నాయి&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై దాడులకు బ్రేక్‌ ఇచ్చినా&period;&period;ఇరాన్‌&comma; ఇజ్రాయెల్‌ ఎక్కడా తగ్గడం లేదు&period; బాంబుల వర్షం కురిపిస్తున్నాయి&period; ఇక ఇరాన్‌ ఐతే గల్ఫ్‌ దేశాలపై డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది&period; తాజాగా కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దాడి చేసింది&period; అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి&period; భారీగా మంటలు&comma; పొగ వ్యాపించాయి&period; రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు&period; ఇరాన్‌ నుంచి వచ్చిన పలు క్షిపణులు&comma; డ్రోన్‌లను తమ రక్షణవ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపాయి కువైట్‌ దళాలు&period;<&sol;p>&NewLine;<p>యుద్ధం ప్రారంభమైన పిబ్రవరి 28à°µ తేదీ నుంచి ఇరాన్‌పై 15&comma;000 బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది&period; ఈ మేరకు మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ&comma; గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ బాంబులు వేశామని తెలిపారు&period; గత ఏడాది జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన సంఘర్షణ సమయంలో కంటే నాలుగురెట్లు బాంబులు ఉపయోగించినట్లు తెలిపారు&period; ఇరాన్‌లోని 3&comma;000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు&period;అయితే ఇరాన్‌పై దాడిని ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు&period; ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది&period;&period;ఈ క్రమంలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించకపోగా&period;&period;మరింత ఉధృత రూపం దాల్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>కాగా&period;&period;ఇరాన్‌ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నాయి&period; మరోవైపు హర్మూజ్‌ను మూసివేయడంతో చమురు&comma; గ్యాస్‌తో పాటు ఎరువుల రవాణాకూ ఆటంకం ఏర్పడుతోందని ప్రపంచ వాణిజ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జేన్‌ మేరీ పౌగమ్‌ పేర్కొన్నారు&period; యూరియా సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతుండడంతో&period;&period; ఎరువుల కొరత&comma; అధిక à°§à°°à°² రూపంలో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశముందని హెచ్చరించారు&period; ఐక్యరాజ్యసమితి వాణిజ్య&comma; అభివృద్ధి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం&period;&period; ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఎరువులు గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్‌ జలసంధి మీదుగానే రవాణా అవుతాయి&period; దీని మూసివేత కొనసాగితే&period;&period; యూరియా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఆధారిత దేశాల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p>యుద్ధం మొదలై కొన్ని వారాలు మాత్రమే అవుతున్నందున ప్రస్తుతం ఎరువుల కొరత అంతగా లేనప్పటికీ &period;&period;ఈ ప్రభావం వచ్చే ఏడాది పంటలపై పడనుంది&period; ప్రపంచ దేశాలు ఎరువులు&comma; ఆహార ధాన్యాల నిల్వలు పెంచుకోవడం ప్రారంభిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతుంది&period; దీనివల్ల ఆహారాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది&period; మరోవైపు యూరియా ఉత్పత్తికి అవసరమైన ద్రవరూప సహజ వాయువు ఎల్‌ఎన్‌జీ ని భారత్‌ కొన్నేళ్లుగా ఖతార్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది&period; ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎల్‌ఎన్‌జీ సరఫరా నిలిచిపోయింది&period; ప్రధాన ఆహార ఎగుమతిదారులైన భారత్‌&comma; థాయ్‌లాండ్‌&comma; బ్రెజిల్‌ వంటి దేశాలలోని కొన్ని యూరియా కంపెనీలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి&period; ప్రపంచ దేశాల్లో ఆహార ధాన్యాలు&comma; వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి&period; ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు సుమారు 2శాతం పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..