వేలకోట్ల అధిపతిగా ఉన్న వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల నుండి వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తూ వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. వేల కోట్లు ఉన్న వివేక్ కుటుంబానికి రిజర్వేషన్లు అనుభవించే హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ప్రోత్సహిస్తున్నాయి.
అందులో భాగంగానే వివేక్ కుటుంబానికి ఇద్దరు ఎమ్మెల్యే లు, ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విమర్శించారు. అందుకు వివేక్ రేవంత్ రెడ్డితో కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. వివేక్ కు చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానం నుండి పోటీ చేసి సత్తా చాటాలని సవాలు విసిరారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుందని విమర్శించారు. తాము ఎప్పటికీ బిజెపితో కలవమని చెప్పారు. బిజెపితో కలవలేదనే అక్కడితోనే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు.