మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుందని, రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు.మంచి పార్టీకి ఓటు వేస్తే.. అంతా మంచే జరుగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ, ఒక్క వైద్య కళాశాల కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో ఉన్నా.. కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలిన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు వచ్చే నిధుల్లో రూ.25వేల కోట్లు కేంద్రం కోత పెట్టిందన్నారు. రైతు బంధు రూ.16వేలు రావాలంటే హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని గెలిపించాలన్నారు. గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారు. ఈసారి అలా జరగొద్దన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డికి ఓటు వేయండి.. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
మంచి పార్టీకి ఓటు వేస్తే.. అంతా మంచే…
58
previous post