చేవెళ్ల ముఖ్య కార్యకర్తల సమావేశానికి డుమ్మా కొట్టిన కేటిఆర్…
ఈ రోజు చేవెళ్ళలో నిర్వహించిన పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి డుమ్మా కొట్టిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. ఈ యొక్క కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే తో పాటు టిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ సురభీ వాలీదేవి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సబితా ఇంద్ర రెడ్డి మాట్లాడుతూ… కెసిఆర్ సంక్షేమమే స్వర్ణ యుగం గా మార్చారని సబితా రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. 24 గంటల కరెంటి ఇస్తే ఇప్పుడు 8 గంటల కరెంటి ఇవ్వడం లేదు.
పొద్దున లేస్తే కేసీఆర్ ను తిట్టాడం చేస్తున్నారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, జిల్లా కొక కలెక్టర్ కార్యాలయలు ఏర్పాటుచేశారు. కేసిఆర్ కి 60 లక్షల సైన్యం ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. మనమధ్య లో కష్టాలు తెలిసిన వ్యక్తి జ్ఞానేశ్వర్ కచ్చితంగా జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. పార్టీలో ఉంది మోసం చేయకండి. ప్రజలకు ఏమీ చేయలేరు. దేవుడి పేరు చెప్పి ఓటు అడుగు తున్నారు. గ్యాస్ ధర, పిట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ఎక్కడ ఇబ్బందులు ఉన్న నేను అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు.
టిఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయ లోపం..
చేవెళ్లలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం అనేది పది రోజుల ముందే నిర్ణయించారని కానీ షాబాద్ మండలం జడ్పిటిసి కి మాత్రం నిన్న సాయంత్రం ఏడు గంటలకు తెలిపారని అప్పుడుసమావేశానికి ఎవరిని తీసుకురావాలో ఆయనకు అర్థం కాలేదని కాబట్టి ఇలాంటి సమావేశాలు ఏమైనా ఉంటే ముందుగానే తెలుపాలని ఆయన ఈ సభాముఖంగా తెలిపారు..