సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) పట్టణంలోని కృషి డిఫెన్స్ కాలనీలోని నివాసముంటున్న పటాన్చెరు ఇరిగేషన్ ఏఈ (Patancheru Irrigation AE) దిలీప్ భార్య దేవిక(36) మృతి చెందారు. సంగారెడ్డి ఇరిగేషన్ ఏఈ దేవిక బుధవారం ఉదయం ఇంట్లో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేవిక మధ్యాహ్నం మృతి చెందారు. పోలీసులు సమాచారం అందుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి సుదర్శన్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిచదవండి: లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.