యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రం ఆర్డీవో కార్యాలయం ముందు ట్రిబుల్ ఆర్ భూ బాధితులు తమకు న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు. మొదటి అలైన్మెంట్ ప్రకారమే ట్రిబుల్ ఆర్ నిర్మాణం జరపాలని, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల, బాగు కోసం గత ప్రభుత్వం త్రీబుల్ ఆర్ నిర్మాణం అలైన్మెంట్ మార్చారని దీని ద్వారా చిన్న సన్నకారు రైతులు భూములు కోల్పోతున్నారని మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇండ్లు కోల్పోతున్నారని తమకు న్యాయం చేయాలని చౌటుప్పల్, వలిగొండ మండలాల రైతులు ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొదటి అలైన్మెంట్ ప్రకారం సన్న, చిన్న రైతుల భూములు కోల్పోలేదని కొందరు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల బాగు కోసం అలైన్మెంట్ మార్చడంతో చిన్న, సన్న కారు రైతుల పోవడంతో పాటు కొంతమంది ఇండ్లు కూడా కోల్పోతున్నారు. ఇందులో భాగంగా మందొలగూడెం గ్రామ రైతు మామిడి నర్సిరెడ్డి తన 8 ఎకరాల భూమిలో సుమారు ఆరు ఏకరాల భూమిని త్రిబుల్ ఆర్ రోడ్ విస్తరణ కోల్పోతుందని బాధపడుతూ రెండు ఏకరాలలో వ్యవసాయం ఎలా చేయాలని దిగులుతో వారం రోజుల క్రితం మరణించాడు. కావున మొదటి అలైన్మెంట్ ప్రకారమే నిర్మాణం చేపట్టాలని ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందించామని రైతులు తెలుపుతున్నారు.
96
previous post