బద్వేల్ పట్టణంలో ఏపీ టైటిలింగ్ ల్యాండ్ యాక్టును ఉపసంహరించు కోవాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి వి ఎన్ ప్రసాద్, సీనియర్ న్యాయవాది దేవి రెడ్డి బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ…. ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు సంబంధించిన విధులను తగ్గిస్తూ న్యాయవ్యవస్థ ను నిర్వీర్యం చేస్తోందని, న్యాయస్థానాలు చేయాల్సిన అధికారాలను రెవిన్యూ వ్యవస్థకు కట్టబెట్టడం దారుణమని తెలిపారు. భూ సమస్యలు, సెక్షన్ 8 ప్రకారం న్యాయస్థానాల పరిధిలో లేకుండా, సిపిసి అండ్ ఎవిడెన్స్ యాక్ట్ లేకుండా, భూ సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఏపీ టైటిలింగ్ 2022 యాక్ట్ ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కావున ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, రాజేశ్వరరావు, ఈసీ ఓబుల్ రెడ్డి, డివిఎస్సార్ కృష్ణ, రమణ రెడ్డి, తదితర న్యాయ వాదులు పాల్గొన్నారు.
న్యాయవాదుల నిరసన ర్యాలీ…..
63
previous post