92
అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే చూస్తు ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని, బ్రాందీ షాపు వద్ద కాపలా పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడి మహిళలు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెలో చింతమనేని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. జగన్ కు దమ్ముంటే రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు, గన్ మెన్లు లేకుండా కనీసం బయటకు రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ముఖ్యమంత్రి పాపం పండిందని, ప్రజలు ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని చింతమనేని తెలిపారు.