57
గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వార్షిక జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం యువత భవితను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున నోటిఫికేషన్ల పేరుతో మరోసారి వంచనకు సిద్ధమయ్యారని లోకేశ్ విమర్శించారు.
Read Also..
Read Also..