Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!

బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు..!

by Satya
buddha venkanna

ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని టీడీపీ నేత, పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీ బుద్దా వెంకన్న అన్నారు. పులివెందులలో కూడా ముఖ్యమంత్రి జగన్ ను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రజలు జగన్ ను నమ్మడం లేదని ఈ విషయం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో అర్థమవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి, ఇడుపులపాయ ప్యాలస్ లలో జగన్ దాచుకున్న డబ్బును బయటకు తీస్తామని వెంకన్న తెలిపారు. తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయి కంటతడి పెడుతుంటే మంత్రులు మాత్రం హాయిగా బస్సు యాత్రలు చేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల బాధలను మంత్రులు వినాలని చెప్పారు. జగన్ పాలనలో కేవలం విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మాత్రమే బాగుపడ్డారని దుయ్యబట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: