103
బాంబులకే భయపడని కుటుంబం మాది మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతమా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావించాడని అన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడారు. జగన్ అంటే ఓ ప్రిజనరీ అని…చంద్రబాబు అంటే విజనరీ అన్ని అన్నారు.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.