132
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శంఖారావం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డమా బుస్సు ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014 తర్వాత ఆముదాలవలస నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో అభివృద్ధి చేసిందని, కానీ 2019లో ప్రజలు ఇక్కడ డమా బుస్సు ఎమ్మెల్యేని గెలిపించారని లోకేశ్ వెల్లడించారు. అందుకు మనం కూడా కారణమే నాడు మనం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం అని వివరించారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.