ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర

Lokesh Yuvagalam padayatra

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది&period; చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27à°¨ ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర నిన్నటితో పూర్తి అయింది&period; రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు&comma; 232 మండలాలు&comma; మున్సిపాలిటీలు&comma; 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు దిగ్విజయంగా లోకేష్ పాదయాత్ర జరిగింది&period; మొత్తం 3వేల 132 కిలో మీటర్లు మేర లోకేష్ పాదయాత్ర చేశారు&period; గతంలో టీడీపీ అధినేత&comma; తండ్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను ఎక్కడైతే ముగించారో లోకేష్ కూడా అక్కడే తన యువగళం పాదయాత్రను ముగించారు&period; ఈ సందర్భంగా విశాఖ జిల్లా అగనంపూడి వద్ద నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు&period; పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి టీడీపీ&comma; జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు&period; వారందరికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు&period; ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు&period; రాష్ట్రానికి అసమర్ధుడు సీఎం అయ్యారని&comma; వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు&period; నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని పేర్కొన్నారు&period; అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని చెప్పారు&period; భవిష్యత్ పై ఆశలు కోల్పోయిన యువతకు తన యువగళం పాదయాత్రతో భరోసా కల్పించానని చెప్పారు&period; పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..