87
కృష్ణాజిల్లా గన్నవరం కోనయ్య చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఆగిరిపల్లి నుంచి గన్నవరం ఓవర్ లోడుతో వచ్చే క్వారీ లారీ, కొనయ్య చెరువు వద్ద మూడు రోడ్లు క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని కొట్టింది. టిప్పర్ లారీ ఢీకొన్న దాటికి ద్విచక్ర వాహనదారుడు అక్కడకక్కడ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం కాలనీ వాసి తిరువీధి వెంకటేశ్వరరావు (60) గా గుర్తింపు.. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.