అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్యం..

Anganwadi

Advertisements

&NewLine;<p>గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు&period; ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే&comma; రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని&comma; వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు&period; ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు&comma; ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి&comma; వారికి భోజనాలు ఏర్పాటు చేశారు&period; నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని&comma; ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని&comma; లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.