మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ విడుదల…

MLA who released the poster

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మహాలక్ష్మి పథకం&comma; రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పోస్టర్ ని విడుదల చేసారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి&period; అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ&comma; షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు&period; మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీ పతాకలను తప్పకుండా అమలు చేస్తామని వివేక్ తెలిపారు&period; అందులో రెండు పథకాలను అమలు పరిచామని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు&period; మరికొద్ది రోజుల్లోనే ఇచ్చిన మిగితా హామీలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు&period; ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రీ డిజైన్ చేసి కోట్ల రూపాయలు వెనుకేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగానే బ్యాక్ వాటర్ తో పంట పొలాలు మునిగి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని&comma; వారికి త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపుతానని ఆయన హామీ ఇచ్చారు&period; కాంగ్రెస్ హయాంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు&period; నియోజకవర్గ అభివృద్ధికై నిర్విరామంగా కృషి చేస్తానని&comma; తాను నియోజకవర్గంలోనే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్&comma; మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు&comma; జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి&comma; వివిధ శాఖల అధికారులు&comma; కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..