శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు…

Mahashivratri Brahmotsavam at Srisailam Mahakshetra

Advertisements

&NewLine;<p>శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది&period; ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో డి&period;పెద్దిరాజు ప్రకటన ద్వారా తెలిపారు&period; ముఖ్యంగా మార్చి 1 వతేది నుండి 11 వతేది వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు&period; ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం 7&colon;30 వరకు నిర్దిష్టవేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు&period; 5 వ తేదీ సాయంత్రం 7&colon;30 నుండి 11 వతేది వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర&comma;అతి శీఘ్రదర్శనానికి ఆన్లైన్&comma;కరెంట్ బుకింగ్ కి ఏర్పాటు చేశామని భక్తులు గమనించి దేవస్థానానికి సహకరించాలని భక్తులను ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.