81
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. నిర్మల్ నియోజకవర్గ లోని వివిధ మండలాలకు చెందిన సుమారు 259 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.ప్రజలకు ప్రభుత్వం నుండి రావలసిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానని, నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి తాను ఎల్లప్పుడూ అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు.
Read Also..