శ్రీశైలం పురవీధులలో మల్లన్న రథోత్సవం…

Mallanna Rathotsavam in the streets of Srisailam

Advertisements

&NewLine;<p>శ్రీశైలంలో తొమ్మిదవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంభరాన్నంటాయి&period; అశేష జనవాహిని మద్య శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది&period; శ్రీస్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి ఓంకార నాదంతో ఓం నమఃశివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులకించి పోయారు&period; ముందుగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు&period; అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రధాశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు&period; అనంతరం రథానికి రధంగా పూజలు&comma; రధంగా హోమం&comma; రధంగా దేవత బలిసమర్పణ తదితర పూజలు నిర్వహించి శ్రీస్వామి అమ్మవార్లు రధోత్సవానికి సిద్ధమయ్యారు&period; అశేష జనవాహిని మద్య రథోత్సవం కధలగానే వేలాదిమంది భక్తులు ఓం నమః శివాయ నినాదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు&comma; అరటిపండ్లను రధంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు&period; ఈ రథోత్సవం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి&comma; ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి&comma; ఆలయ ఈవో పెద్దిరాజు&comma; ట్రస్ట్ సభ్యులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..