82
కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెద్దపల్ల వద్ద ఆర్ అండ్ బి రోడ్డు పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆలమూరు ఎస్సై ఎల్ శ్రీను నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన ఈతకోట శ్రీనివాసరావు (45) ఎలక్ట్రికల్ స్కూటీ పై వెదురుమూడి వైపు నుండి కొత్తూరు సెంటర్ వైపు వెళ్ళుచుండగా మార్గమద్యంలో పెదపల్ల కోళ్ళ ఫారం సమీపంలో వెనుక నుండి లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈతకోట శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి తరలించారు.