అనంతపురం జిల్లా గుత్తిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యపై గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో నివాసముంటున్న దంపతులు రవి దేవీలు చిన్నపాటి విషయంపై తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మద్యం తాగినందుకు డబ్బులు ఇవ్వలేదు అంటూ భార్య దేవి పై భర్త రవి గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిలో భార్య తలకు బలమైన గాయమైంది. స్థానికులు కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటరామిరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని దాడికి ఉపయోగించిన గొడ్డలిని దాడికి పాల్పడిన భర్త రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు బాధితురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త…
61
previous post